అందరి కోసం అమరావతి పేరుతో రన్: హీరో నిఖిల్

GNTR: మంగళగిరిలో ఆదివారం 'అందరి కోసం అమరావతి' పేరుతో టూ ఏ రన్ నిర్వహించారు. ఎన్నారై జంక్షన్ నుంచి 3కె, 5కె, 10కె రన్‌లో ప్రజలు పాల్గొన్నారు. దీనిని సినీ హిరో నిఖిల్ ప్రారంభించారు. రన్‌లో 5 వేల మంది పాల్గొన్నారు. జీవనశైలిలో మార్పులే వ్యాధులకు కారణమని నిఖిల్ తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.