'మండల ప్రజలకు తహశీల్దార్ సూచనలు'
VKB: మొంథా తుఫాను కారణంగా మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పూడూరు తహశీల్దార్ విజయ్ కుమార్ సూచించారు. మండలంలో పలు వాగులు, కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయని, వాటిని దాటే ప్రయత్నాలు చేయొద్దని హెచ్చరించారు. విద్యుత్ స్తంభాల వద్దకు ఎవరూ వెళ్లొద్దని చెప్పారు. అవసరం ఉంటేనే బయటికి రావాలని మండల ప్రజలకు సూచించారు.