దిల్ రాజు 'ఏఐ' స్టూడియో ప్రారంభించిన మంత్రి

ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు చెందిన 'లార్వెన్ ఏఐ' స్టూడియోను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. స్టూడియో లోగోను నిర్మాత అల్లు అరవింద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. లార్వెన్ స్టూడియో తెలంగాణ, HYDకు మరింత పేరు తీసుకురావాలని అన్నారు. అలాగే దిల్ రాజు, అతడి బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. చిత్ర పరిశ్రమలో ఏఐ మార్పులు తీసుకొస్తుందని పేర్కొన్నారు.