'అభివృద్ధిలో భాగస్వాములు కావాలి'
హుజూర్ నగర్ పట్టణ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్మన్ డీ. శ్రీనివాస్ వైస్ ఛైర్మన్ మల్లికార్జునరావు కోరారు. 8, 9 వార్డుల సభలో వారు మాట్లాడుతూ.. మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని తెలిపారు. కౌన్సిలర్ ఉదయభాను గోవిందపురంలో సీసీ రోడ్లు, బ్రిడ్జి నిధులు, పాఠశాల భవనానికి అదనంగా రూ.20 లక్షలు కేటాయించాలని కోరారు.