రైతులకు యూరియా బస్తాల పంపిణీ

రైతులకు యూరియా బస్తాల పంపిణీ

MNCL: ప్రతి రైతుకు యూరియా బస్తాను అందిస్తామని దండేపల్లి మండల వ్యవసాయ అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం మండలంలోని వివిధ రైతు వేదికల వద్దకు యూరియా బస్తాల కోసం రైతులు తరలివచ్చారు. రైతులకు అవసరమైన యూరియా బస్తాలను ప్రభుత్వం సరఫరా చేసింది. దీంతో మండలంలోని ముత్యంపేట రైతు వేదిక వద్దకు పలు గ్రామాల రైతులు తరలివచ్చి యూరియా బస్తాలను తీసుకువెళ్తున్నారు.