ఆంధ్ర ఓపెన్ గోల్ఫ్ విజేతగా ఖలిన్ జోషీ
విశాఖలోని ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్‌లో జరిగిన ఆంధ్ర ఓపెన్ గోల్ఫ్ చాంపియన్‌షిప్‌లో ఖలిన్ జోషీ విజేతగా నిలిచారు. నాలుగు రౌండ్లలో నైన్ అండర్ 275 స్కోరు సాధించి, అక్షయ్ శర్మపై నాలుగు షాట్ల ఆధిక్యంతో టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. 44 నెలల నిరీక్షణ తర్వాత వచ్చిన ఈ విజయం జోషీకి ఏడవ ప్రొఫెషనల్ టైటిల్. ఈ గెలుపుతో రూ.15 లక్షల బహుమతి అందుకున్నారు.