రోడ్డు పనులకు శ్రీకారం చుట్టినా ఎమ్మెల్యే

రోడ్డు పనులకు శ్రీకారం చుట్టినా ఎమ్మెల్యే

MBNR: భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలో రూ.4.50 కోట్ల నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. భూత్పూర్-నాగర్‌కర్నూల్ ప్రధాన రహదారి నుంచి చౌలా తండా, కర్వేన గ్రామాల మీదుగా వెళ్లే ఈ రోడ్డు నిర్మాణంతో ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ పనులను ఆయన స్వయంగా జేసీబీతో ప్రారంభించారు.