VIDEO: ఆపరేషన్ సింధూర్ చేపట్టడంపై బీజేపీ శ్రేణుల సంబరాలు

MLG: జిల్లా కేంద్రంలో బుధవారం బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడిని నిరసిస్తూ, దానికి ప్రతి చర్యగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై జాతీయ జెండాలతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. బాణసంచా పేలుస్తూ ఆనందం వ్యక్తం చేసిన బీజేపీ శ్రేణులు మిఠాయిలు పంచుకున్నారు.