ఇసుక కోసం ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి: MRO
MDK: మండలంలో ఇసుక అవసరమైన వారు 'మన ఇసుక వాహనం' పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కొల్చారం తహశీల్దార్ శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇసుక అక్రమ రవాణా జరగకుండా ప్రభుత్వం కొత్త యాప్ అందులో అందుబాటులోకి తెచ్చిందని వెల్లడించారు. దీని ద్వారా ఇల్లు కట్టుకునే లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచే ఇసుక సరఫరా చేస్తామన్నారు.