HYDలో హోమియో వైద్యం వైపు పెరుగుతున్న ఆదరణ

HYDలో హోమియో వైద్యం వైపు పెరుగుతున్న ఆదరణ

HYD: రామంతపూర్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ హోమియోపతి ఆసుపత్రికి రోజురోజుకు ఔట్ పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 700 మంది వరకు రోగులు చికిత్స కోసం ఆసుపత్రిని సందర్శిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రజల్లో హోమియో వైద్యం పట్ల విశ్వాసం పెరుగుతుండటంతో ఈ సంఖ్య పెరుగుతోందని పేర్కొన్నారు.