కల్వర్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి
SDPT: ములుగు మండలం వంటిమామిడి వద్ద ఘోర కారు ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి అల్వాల్‌లో ఓ వేడుకకు హాజరై కొక్కొండకు తిరిగి వస్తుండగా, కారు కల్వర్టును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆశెల్లి అనురాధ(45) అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె పిల్లలు రిషికేష్, భవిష్యతో పాటు బంధువు అరుణ తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.