రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

BHNG: రోడ్డు ప్రమాదంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన వంగపల్లి వద్ద మంగళవారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కిమ్యా నాయక్ భువనగిరిలో ఎక్సైజ్ కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తున్నారు. విధులు ముగించుకొని బైక్ పై ఆలేరుకు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.