'అంబేద్కర్ ఆలోచన విధానాలను అందరూ అలవర్చుకోవాలి'
NRML: అంబేద్కర్ ఆలోచన విధానాలను, రాజ్యాంగ ఆవశ్యకతను అన్ని వర్గాల ప్రజలకు వివరించేందుకే జై భీమ్ జ్ఞాన యాత్ర నిర్వహించనున్నట్లు అంబేద్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ల రమేష్, అంబేద్కర్ పూలే మహాజన సంఘం జిల్లా అధ్యక్షుడు మునీసుల శైలేందర్ తెలిపారు. దస్తురాబాద్ మండల కేంద్రంలో సమావేశాన్ని నిర్వహించి అంబేద్కర్ ఆలోచనా విధానాల గురించి ప్రజలకు వివరించారు.