చెరువులను తలపిస్తున్న రోడ్లు

చెరువులను తలపిస్తున్న రోడ్లు

SDPT: భారీ వర్షాలకు సంగారెడ్డి పట్టణంలోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. బృందావన్ కాలనీ నుంచి ప్రగతి నగర్ వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయంగా మారడంతో నాలుగు రోజులుగా వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రెండు రోజుల క్రితం పాఠశాల బస్సు ఎక్కే చిన్నారి బురదలో పడిపోయాడు. మున్సిపల్ అధికారులకు విన్నవించిన పట్టించుకోవడంలేదని స్ధానికులు ఆరోపిస్తున్నారు.