పేకాట శిబిరంపై పోలీసుల దాడి
WG: నరసాపురం టౌన్ 29 వార్డు శివారులో శుక్రవారం సాయంత్రం పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసినట్లు నరసాపురం టౌన్ ఏఎస్సై జి.నాగరాజు తెలిపారు. ఈ దాడిలో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి రూ.16,430 నగదు, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.