నిరంతరం గ్రామ సచివాలయాల పర్యవేక్షణ: డిప్యూటీ ఎంపీడీవో

నిరంతరం గ్రామ సచివాలయాల పర్యవేక్షణ: డిప్యూటీ ఎంపీడీవో

అల్లూరి: సచివాలయాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలకు సక్రమంగా సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని డిప్యూటీ ఎంపీడీవో టీ.శ్రీనివాసరావు అన్నారు. కొయ్యూరు డిప్యూటీ ఎంపీడీవోగా నూతనంగా ఆయన నియమితులయ్యారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. సచివాలయాల పర్యవేక్షణకు ప్రభుత్వం తమను ప్రత్యేకంగా నియమించినట్లు తెలిపారు. సచివాలయ సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు