భారీ అగ్నిప్రమాదం.. రూ.కోట్లలో ఆస్తి నష్టం!
TG: బాచుపల్లి(HYD)లోని ప్రగతినగర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు వరుసగా ఉన్న 30కి పైగా ఫర్నీచర్ షాపులను దహించివేసాయి. ఒక్కో షాపులో దాదాపు రూ.40 లక్షల విలువైన సామాగ్రి బూడిద కావడంతో రూ.కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లింది. అగ్నిమాపక సిబ్బంది 5 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం తప్పింది.