సర్పంచ్‌గా కక్కునూరి వంశీ గెలుపు
జగిత్యాల రూరల్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ బలపర్చిన కక్కునూరి వంశీ తన సమీప అభ్యర్థిపై 454 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందాడు. గ్రామ అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు వంశీ పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.