పిల్లలతో కలిసి తల్లి అదృశ్యం.. కేసు నమోదు
E.G: చాగల్లు మండలం కలవలపల్లి గ్రామానికి చెందిన వివాహిత జొన్నా దేవి (28) అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు చాగల్లు ఎస్సై కె.నరేంద్ర మంగళవారం తెలిపారు. ఆమె భర్త శివరామకృష్ణతో మనస్పర్ధలు కారణంగా ఆమె, తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఈనెల 23వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయిందని చెప్పారు. వారి ఆచూకీ లభించకపోవడంతో భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.