ఇంటికే పోలీస్: సూర్యాపేట ఎస్పీ వినూత్న నిర్ణయం

ఇంటికే పోలీస్: సూర్యాపేట ఎస్పీ వినూత్న నిర్ణయం

SRPT: బాధితులు పోలీస్ స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేకుండా, నేరుగా ఇంటికే వెళ్లి ఫిర్యాదులు స్వీకరించే నూతన విధానాన్ని అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు ఇది వరమని, ఫోన్ కాల్ అందగానే సిబ్బంది స్పందిస్తారని పేర్కొన్నారు. పారదర్శక సేవలు, వేగవంతమైన కేసు నమోదు కోసం ఈ సంస్కరణలు చేపట్టినట్లు వెల్లడించారు.