ట్రంప్ ఏం మాట్లాడుతున్నారో తెలియదు: వెంకయ్య

ట్రంప్ ఏం మాట్లాడుతున్నారో తెలియదు: వెంకయ్య

యుద్ధంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ది అనాలోచిత యుద్ధం అని అన్నారు. 'ట్రంప్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు. ఇరాన్, ఇజ్రాయెల్‌తో భారతదేశం స్నేహంగా ఉంది. ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలి. మనం శాంతి కాముకులం. మన జోలికి వస్తే ఆపరేషన్ సింధూర్‌తో సత్తా చూపించాం. యోగా ఫర్ మోదీ కాదు, యోగా ఫర్ బాడీ' అని పేర్కొన్నారు.