సరకు రవాణాలో విశాఖ పోర్టు రికార్డు

సరకు రవాణాలో విశాఖ పోర్టు రికార్డు

AP: సరకు రవాణాలో విశాఖ పోర్టు అథారిటీ(VPA) రికార్డు సృష్టించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం 345 రోజుల్లోనే 85.07M మెట్రిక్ టన్నుల సరకు రవాణా చేసి చరిత్రాత్మక మైలురాయిని అందుకుంది. 92 ఏళ్ల విశాఖ పోర్టు చరిత్రలో ఇదే అత్యధిక సరకు రవాణాగా నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో పోర్టుకు నిర్దేశించిన 90MMT సరకు నిర్వహణ లక్ష్యాన్ని సాధిస్తామని పోర్టు అథారిటీ ఛైర్మన్ తెలిపారు.