VIDEO: 'కంపెనీ ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలి'

VZM: భూ నిర్వాసితులకు జిందాల్ కంపెనీ ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చల్లా జగన్ డిమాండ్ చేశారు. ఎస్ కోట మండలం బొడ్డవరలో శుక్రవారం భూ నిర్వాసితులతో కలసి నిరసన చేపట్టారు. జీవో నెంబర్ 14ను రద్దు చేయాలని పేర్కొన్నారు. జిందాల్ భూముల్లో ఇండస్ట్రియల్ రియల్ ఎస్టేట్ చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు.