VIDEO: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

VIDEO: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

ELR: దెందులూరు మండలం పాతూరుకు చెందిన బండి సుగుణకుమార్ బైక్‌పై వెళ్తుండగా టైర్ పంచర్ కావడంతో వాహనం అదుపు తప్పి ప్రమాదం జరిగింది. శనివారం అర్ధరాత్రి దెందులూరు నుంచి పాతూరుకు తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో సుగుణకుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే హైవే సేఫ్టీ సిబ్బంది స్పందించి అతన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.