VIDEO: సింహాచలం ఆలయం మూసివేత
VSP: చంద్రగ్రహణం నేపథ్యంలో విశాఖలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి ఆలయాన్ని మంగళవారం మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. గ్రహణ సమయంలో సంప్రదాయాల ప్రకారం దర్శనాలు నిలిపివేస్తామని వెల్లడించారు. గ్రహణానంతరం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.