ఎస్సైగా వెంకటరాముడు బాధ్యతల స్వీకరణ
సత్యసాయి: ధర్మవరం పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కి నూతన ఎస్సైగా వెంకటరాముడు బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ఎస్సై శ్రీరాములు ఆరు నెలల క్రితం పదవీ విరమణ పొందారు. ధర్మవరం ట్రాఫిక్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న వెంకటరాముడును జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని ఆయన తెలిపారు.