విద్యార్థులకు డెంటల్ కిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

విద్యార్థులకు డెంటల్ కిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

తూ.గో: నోటి ఆరోగ్యంతోనే శారీరక ఆరోగ్యం సాధ్యమని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. మూలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్, జీఎస్ఎల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనపర్తి జడ్పి ఉన్నత పాఠశాలలో శుక్రవారం దంత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జీఎస్ఎల్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్‌తో కలిసి ఎమ్మెల్యే నల్లమిల్లి విద్యార్థులకు డెంటల్ కిట్లను పంపిణీ చేశారు.