'జర్నలిజం పేరుతో ఉద్యోగులను వేధిస్తే చర్యలు'

'జర్నలిజం పేరుతో ఉద్యోగులను వేధిస్తే చర్యలు'

CTR: జర్నలిజం పేరుతో ఉద్యోగులను వేధించడం తగదని, అలా బ్లాక్ మెయిల్ చేసే విలేకరులపై తగిన చర్యలు తప్పవని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడటం, వారిని బ్లాక్ మెయిల్ చేయకుండా కార్యాలయంలోని సిబ్బంది నిర్భయంగా పని చేసుకునే వాతావరణం కల్పించడం తన బాధ్యత అని కలెక్టర్ తెలిపారు.