'మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి'

'మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి'

MBNR: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ కుష్బూ గుప్తా సూచించారు. ఇవాళ జిల్లా కేంద్రంలో ఎస్పీ జానకితో కలిసి డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈగల్ ఫోర్స్, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో 600 మంది విద్యార్థులతో క్లాక్ టవర్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. సమాజం మొత్తం డ్రగ్స్ నిర్మూలనలో భాగస్వాములు కావాలని కలెక్టర్ తెలిపారు.