మేధా స్కూల్ విద్యార్థుల భవిష్యత్తు కాపాడుతాం: ఎంఈవో

మేధా స్కూల్ విద్యార్థుల భవిష్యత్తు కాపాడుతాం: ఎంఈవో

TG: సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని మేధా స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు స్పందించారు. విద్యార్థుల వివరాలు సేకరించి, వారిని మరో స్కూల్‌కి బదిలీ చేయడానికి అంగీకారం తెలిపారు. విద్యార్థులను సరైన స్కూల్‌లో చేర్పించి, వారి భవిష్యత్తును కాపాడుతామని ఎంఈవో హరిచందన్ పేర్కొన్నారు.