ప్రజల విన్నపాలు స్వీకరించిన మంత్రి సవిత
SS: టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో మంత్రి సవిత ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పెన్షన్లు, భూ ఆక్రమణలు, వైద్య సహాయంపై పలువురు సమస్యలు విన్నవించారు. భూ కబ్జాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులుగా అవకాశం కల్పించాలని ఎంఆర్‌సీలు కోరగా, పరిష్కారానికి హామీ ఇచ్చారు.