'ప్రకృతి వ్యవసాయంపై రైతులు అవగాహన కలిగి ఉండాలి'
PLD: ప్రకృతి వ్యవసాయంపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అమల కుమారి అన్నారు. మాచవరం మండలం మోర్జంపాడు RSKలో రైతులకు ఆమె అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రసాయనాల వాడకం తగ్గించి ప్రకృతి వ్యవసాయం అవలంబిస్తే ఎక్కువ దిగుబడులు సాధించవచ్చన్నారు. ఇందులో భాగంగా సిబ్బంది అప్పలరాజు, మేరీ, సౌజన్య, పవన్ కుమార్, రైతులు పాల్గొన్నారు.