ద్విచక్ర వాహనం చోరీ.. కేసు నమోదు

ద్విచక్ర వాహనం చోరీ.. కేసు నమోదు

WNP: జిల్లాలోని అంబేడ్కర్ చౌరస్తాలో ద్విచక్ర వాహనం చోరీకి గురైన ఘటనలో కేసు నమోదు చేశామని పట్టణ ఎస్సై హరిప్రసాద్ తెలిపారు. అక్షయ రెస్టారెంట్ వద్ద నిలిపిన ద్విచక్ర వాహనం చోరీకి గురైందని బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. సమీపంలోని నిఘా కెమెరాలను పరిశీలించగా ఓ యువకుడు దొంగతనం చేసినట్లు గుర్తించామని, అతన్ని పట్టుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామన్నారు.