ఘనంగా శ్రీ సీతా జన్మోత్సవ వేడుకలు

ఘనంగా శ్రీ సీతా జన్మోత్సవ వేడుకలు

JN: జనగామలో విశ్వహిందూ పరిషత్ – మాతృశక్తి విభాగం ఆధ్వర్యంలో సోమవారం శ్రీ సీతా జన్మోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వేద మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు, భజనలు, మహా నీరాజన కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త డా.మోహనకృష్ణ భార్గవ మాట్లాడుతూ.. సీతాదేవి జీవితం మహిళలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.