ఉరేసుకుని యువతి ఆత్మహత్య
MDCL: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జీడిమెట్ల PS పరిధి చింతల్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు మెదక్ జిల్లా థోర్నల్‌కు చెందిన కళ్యాణి(25)గా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.