"రెండో రోజు వైభవంగా కొనసాగుతున్న బుగులోని జాతర"
BHPL: రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులోని బుగులోని వెంకటేశ్వరస్వామి జాతర బ్రహ్మోత్సవాలు బుధవారమైన రెండో రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. అయితే నేడు కార్తీక మాసం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో ఆలయ పరిసరాల్లో భక్తిమాయ వాతావరణం నెలకొంది.