మహిళలకు చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
MDK: గత పదేళ్ల కాలంలో మహిళా సంఘాలను నిర్వీర్యం చేశారని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆరోపించారు. ఇవాళ నియోజకవర్గం పరిధి పెద్ద శంకరంపేటలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యతనిస్తున్నదన్నారు. వారిని కోటీశ్వరులను చేసేందుకు పలు అభివృద్ధి పథకాలు ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్నారు.