VIDEO: రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఘనంగా కుంకుమార్చన

VIDEO: రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఘనంగా కుంకుమార్చన

NRML: దిలావర్పూర్ మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం వేద పండితుల ఆధ్వర్యంలో కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ పూజారి నరేష్ శర్మ కుంకుమార్చన విశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.