దెబ్బతిన్న పత్తి పంటను పరిశీలించిన కలెక్టర్
ప్రకాశం: మార్కాపురం మండలంలోని నికరంపల్లి గ్రామాన్ని శనివారం ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజా బాబు సందర్శించారు. ఈ సందర్భంగా దెబ్బతిన్న పత్తి పంటను స్థానిక శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డితో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతులను అన్ని విధాల ఆదుకుంటామని తెలిపారు. అనంతరం మార్కాపురం, వేమలకోట గ్రామాలలో ఉన్నచెరువులను ఆయన పరిశీలించారు.