నేడు, రేపు జిల్లాలో వర్షాలు

కృష్ణా: జిల్లాలో నేడు, రేపు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. పలుచోట్ల పిడుగులతో కూడిన తేలిక నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇటువంటి వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.