యువ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా తేజేశ్వర్ రెడ్డి
ATP: అనంతపురం జిల్లా యువ మోర్చా అధ్యక్షుడిగా తేజేశ్వర్ రెడ్డి నియమితులయ్యారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజేశ్ నుంచి మంగళవారం తేజేశ్వర్ రెడ్డి నియామక ఉత్తర్వులను అందుకున్నారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు. తేజేశ్వర్ రెడ్డి నియామకంపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.