'లక్ష్య సాధన పై విద్యార్థులకు అవగాహన సదస్సు'

PDPL: మంథని ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు మానవ హక్కులు, అక్రమ రవాణా, తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. టోల్ ఫ్రీ నంబర్లు 1098, 181, డయల్ 100ల ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం సైకాలజిస్ట్ అమ్మ ఆనంద్ ఒత్తిడి, భావోద్వేగాలను అధిగమించి జీవిత లక్ష్యాలను సాధించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఆలోచన విధానాలపై పలు సూచనలు చేశారు.