ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొనున్న హోం మంత్రి
AKP: హోంమంత్రి వంగలపూడి అనిత బుధవారం ఎస్.రాయవరం, పాయకరావుపేట మండలాల్లో పర్యటించనున్నట్లు నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేశ్ తెలిపారు. ఉ.10 గంటలకు ఎస్.రాయవరం మండలం గెడ్డపాలెంలో జరిగే ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. 11 గంటలకు పాయకరావుపేటలో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని అన్నారు.