జలధార–జల హారతిపై సమీక్షించిన కలెక్టర్
KRNL: కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో 'జలధార- జల హారతి' కార్యక్రమ నిర్వహణపై ఇవాళ కలెక్టర్ డా.ఏ.సిరి సాగునీటి సంఘాల అధ్యక్షులు, జలవనరుల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు, నీటి వినియోగంపై అవగాహన, ప్రజల భాగస్వామ్యం పెంపు వంటి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.