ముత్యాల పోచమ్మకు ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే
NRML: ఖానాపూర్ పట్టణ కేంద్రంలో ముత్యాల పోచమ్మ ఆలయ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ వార్షికోత్సవానికి ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముత్యాల పోచమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్ధించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.