VIDEO: గార్డెన్ లా రైతు బజార్‌లో అల్లుకుపోయిన ముళ్ళ తీగలు

SKLM: నరసన్నపేట పట్టణంలోని ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న రైతు బజార్ వద్ద అధికారుల నిర్లక్ష్యం కారణంగా ముళ్ల తీగలు పెద్ద ఎత్తున అల్లుకుపోయాయి. గతంలో ఆర్ అండ్ బి శాఖ నిర్వహణలో ఉన్న ఈ ప్రాంతం, ప్రస్తుతం పంచాయతీ, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో దుస్థితికి చేరుకుంది. ఉన్నవాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు.