అద్దె ఇంట్లో ఉంటూ దొంగతనాలు.. మహిళా అరెస్ట్

అద్దె ఇంట్లో ఉంటూ దొంగతనాలు.. మహిళా అరెస్ట్

తిరుపతి రూరల్‌లో అద్దె ఇంట్లో ఉండే సంధ్య (29) దొంగతనానికి పాల్పడింది. సాయినగర్‌లో నివసించే మౌనిక.. తన ఇంటి తాళాలను రోజు పూలకుండి వద్ద ఉంచే అలవాటును సంధ్య గమనించింది. ఈ నేపథ్యంలో గత నెల 8న, ఈ నెల 5న ఇంట్లోకి చొరబడి నగలు, నగదు దొంగిలించింది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి రూ.1.40 లక్షల నగదు, రూ.16 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.