రాయవరంలో క్షయ వ్యాధి స్క్రీనింగ్ శిబిరం
NGKL: లింగాల మండలం రాయవరం గ్రామంలో నేడు భారీ క్షయ వ్యాధి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో గుర్తించిన 86 హైరిస్క్ గ్రామాల్లో భాగంగా, మొబైల్ ఎక్స్రే వాహనం ద్వారా గ్రామస్థులకు పరీక్షలు చేస్తున్నారని క్షయ పర్యవేక్షకులు ఆరిఫ్ ఖాన్ తెలిపారు. సర్పంచ్ పబ్బతి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..14 ఏళ్లు పైబడిన వారంతా ఈ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.