మృతుడికి మాజీ మంత్రి విడదల రజిని నివాళి

మృతుడికి మాజీ మంత్రి విడదల రజిని నివాళి

PLD: చిలకలూరిపేటలోని గుండయ్యతోటకు చెందిన ఆర్టీసీ మాజీ డ్రైవర్ షేక్ ఖాసీం అనారోగ్యంతో శుక్రవారం మృతిచెందాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి విడదల రజిని అక్కడికి వెళ్లి ఖాసీం మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె వెంట మైనార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.