నకిలీ బ్యూటీ ప్రొడక్ట్స్ విక్రయం
NLR: నెల్లూరులో కొందరు వ్యాపారులు నకిలీ బ్యూటీ ప్రొడక్ట్స్ విక్రయిస్తున్నారని లీగల్ మెట్రాలజీ అధికారులు తెలిపారు. MRPపై అధిక ధర స్టిక్కర్లు అతికించి కస్టమర్లను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. చిన్నబజార్లో చేసిన దాడుల్లో ఒక స్టోర్‌లో కాలం చెల్లిన ఉత్పత్తులు కూడా అమ్ముతున్నట్లు బయటపడిందని పేర్కొన్నారు. GST చెల్లించకుండా భారీ అవకతవకలకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు.